Sirimalli

My WordPress Blog

Peddi Song : మెగా పవర్ స్టార్ ‘పెద్ది’.. సెకండ్ సింగిల్ డేట్ లాక్

Ram Charan Peddi Second Single Release Date Valentines Day Update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘చికిరి చికిరి’ యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ సింగిల్‌పై పడింది. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) లేదా మరుసటి రోజు ఫిబ్రవరి 15న ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఒక పవర్‌ఫుల్ మాస్ నెంబర్ అని, ముఖ్యంగా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా ఉండబోతోందని సమాచారం. ప్రేమికుల రోజున వస్తున్నప్పటికీ, ఇది లవ్ సాంగ్ కాకుండా పక్కా మాస్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. 

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘ఉప్పెన’ వంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో పాటల విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ చేసే డాన్స్ స్టెప్పులు ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట మార్చిలో అనుకున్నప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో ‘పెద్ది’ని ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ లోపు వరుస అప్‌డేట్స్‌తో సినిమాపై హైప్‌ను మరింత పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.