అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 242 ప్రయాణీకులతో ఉన్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికే కుప్పకూలిపోయింది (Flight Crash). అయితే విమానం బిజె ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థుల (Medical Students) హాస్టల్ భవనాలపై కూలింది. ఈ ప్రమాదంలో పలువు వైద్య విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. భోజన సమయం కావడంతో అధికశాతం మంది విద్యార్థులు హాస్టల్‌లోనే ఉన్నారు. అదే సమయంలో విమానం కూలిపోయింది. దీంతో పలువు విద్యార్థులు మృత్యువాత పడినట్లు సమాచారం. విమానం హాస్టల్ భవనంపై కూలిపోవడంతో భవనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వైద్య విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
