Sirimalli

My WordPress Blog

Nani-Sujith: నాని సరసన పూజా హెగ్డే.. ఫస్ట్ టైమ్ ఫ్రెష్ జోడి

Nani Sujith Movie Regular Shooting Begins June Release Date Updates

నేచురల్ స్టార్ నాని వరుస హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రేజీ కాంబో గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే వార్త బయటకొచ్చింది. కాగా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నెల నుంచి మొదలుకానుందట. ఇప్పటికే సుజీత్ అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. నానిని మనం ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త స్టైలిష్ లుక్‌లో, పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో సుజీత్ చూపించబోతున్నారు.

ఇక మరోక విషయం ఏంటి అంటే.. ఈ సినిమాలో నాని సరసన ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. నాని, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో, వీరిద్దరి జోడీ స్క్రీన్ మీద చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఉండబోతోంది. అంతేకాదు ఈ మూవీ కోసం సుజీత్ చాలా టైమ్ తీసుకుని, విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమాను 2027 లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #NaniSujith షూటింగ్ అప్‌డేట్ తెగ వైరల్ అవుతోంది. నాని తన నటనతో, సుజీత్ తన మేకింగ్ స్టైల్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి!