డెంటల్ ఇంప్లాంట్స్ vs సహజ దంతాలు: తేడా ఏంటి? అసలు కృత్రిమ దంతాలు జీవితాంతం పదిలంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కృత్రిమ దంతాలు కేవలం అందానికే కాదు, మనం ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి, స్పష్టంగా మాట్లాడటానికి ఎంతో అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇవి 20 ఏళ్ల తర్వాత కూడా 90% పైగా పటిష్టంగా ఉంటాయి. మీ ఇంప్లాంట్స్ జీవితాంతం మన్నాలంటే ఈ క్రింది సూచనలు పాటించండి.
1. బ్రషింగ్ మరియు క్లీనింగ్
రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు మెత్తటి బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌తో పళ్లు తోముకోవాలి. దీని వల్ల దంతాల మూలల్లో ఉన్న మురికి కూడా సులభంగా తొలగిపోతుంది.
2. ఫ్లాసింగ్ ప్రాధాన్యత
కృత్రిమ దంతాల పైభాగం కొంచెం వెడల్పుగా ఉండటం వల్ల ఆహార పదార్థాలు ఇరుక్కునే అవకాశం ఎక్కువ. అందుకే రోజూ ‘డెంటల్ ఫ్లాస్’ (సన్నటి దారం) ఉపయోగించి పళ్ల మధ్య శుభ్రం చేసుకోవాలి. ఇది గార పట్టకుండా చూస్తుంది.
చెవిలో బడ్స్ వాడుతున్నారా? అయితే ఇది చూడండి!
3. ఆహారపు అలవాట్లు
ఇంప్లాంట్స్‌తో చెరకు గడలు, ఐస్ ముక్కలు, గట్టిగా ఉండే పప్పు గింజలను కొరకకూడదు. అలాగే పళ్లకు అంటుకునే చూయింగ్ గమ్స్, చాక్లెట్లను తినకూడదు.
4. దురలవాట్లకు స్వస్తి
పొగతాగడం వల్ల చిగుళ్లు, ఎముకలు బలహీనంగా మారతాయి. ఇది కృత్రిమ దంతాల మన్నికను తగ్గిస్తుంది. అందుకే ధూమపానానికి దూరంగా ఉండటం చాలా మంచిది.
5. రెగ్యులర్ చెకప్స్
ప్రతీ ఆరు నెలలకోసారి దంత వైద్యుడిని కలిసి పళ్లు క్లీనింగ్ చేయించుకోవాలి. శరీరంలో క్యాల్షియం, విటమిన్-డి స్థాయిలను ఏడాదికోసారి పరీక్షించుకోవాలి. దీనివల్ల దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
గోల్డ్ లోన్ Vs పర్సనల్ లోన్.. ఏది లాభం?


Leave a Reply