అత్యవసరంగా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ లేదా పర్సనల్ లోన్.. మీకు ఏది సరిపోతుందో తెలుసుకోండి!
చాలామందికి ఏదో ఒక సమయంలో అప్పు అవసరవుతుది. అవసరానికి అప్పు తీసుకోవడం మామూలే. దీనికోసం గోల్డ్ లోన్ (బంగారు రుణం), పర్సనల్ లోన్ (వ్యక్తిగత రుణం) లలో ఏది మంచిదో తెలుసుకోవడం ముఖ్యం. మీ కోసం దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.
గోల్డ్ లోన్ (బంగారు రుణం):
తక్కువ వడ్డీ: ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీ పై వడ్డీ భారం తగ్గుతుంది.
వేగవంతమైన ప్రక్రియ: తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. నిమిషాల్లోనే నగదు అందుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు
క్రెడిట్ స్కోర్ అవసరం లేదు: మీ సిబిల్ (CIBIL) స్కోర్ తక్కువగా ఉన్నా ఈసరే మీకు రుణం లభిస్తుంది.
రిస్క్: సకాలంలో చెల్లించకపోతే మీరు లోన్ కోసం పెట్టిన బంగారం వేలానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రుణం తీర్చే విషయంలో ఏ మాత్రం అలసత్వం ఉండకూడదు
పర్సనల్ లోన్ (వ్యక్తిగత రుణం):
పూచీకత్తు అవసరం లేదు: ఎటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన పనిలేదు. మీ పరపతి మీద ఇది ఆధారపడి ఉంటుంది
క్రెడిట్ స్కోర్ కీలకం: మీ ఆదాయం, సిబిల్ స్కోర్ ఆధారంగానే రుణం మంజూరవుతుంది. ఇందులో ఇతర అంశాలు ఏవీ పని చేయవు.
ఎక్కువ వడ్డీ: హామీ లేని రుణం కాబట్టి వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. వడ్డీ ఎక్కువైనా ఫరవాలేదు అనుకుంటే ఇబ్బంది లేదు.
ముందస్తు ఆమోదం: మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే బ్యాంకులే నేరుగా ఆఫర్లు ఇస్తాయి. అప్పుడు మీరు తక్కువ వడ్డీ రేటు కోసం గట్టిగా అడగవచ్చు
మీకు తక్షణమే నగదు కావాలి, తక్కువ వడ్డీ చాలు అనుకుంటే గోల్డ్ లోన్ బెస్ట్. తాకట్టు పెట్టడానికి బంగారం లేదు, కానీ మంచి ఆదాయం ఉందనుకుంటే పర్సనల్ లోన్ ఎంచుకోవచ్చు. మీకున్న అవసరం, అవకాశం బట్టి ఏ రుణం తీసుకోవాలో నిర్ణయించుకోండి.
ముఖ్య గమనిక. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గమనించండి.
Meta Description: Planning to take a loan? Compare Gold Loan vs. Personal Loan to find the lowest interest rates, processing times, and eligibility criteria. Make an informed financial decision today!

Leave a Reply