Sirimalli

My WordPress Blog

Funky Oversees Review : ఫంకీ ఓవర్సీస్ రివ్యూ.. విశ్వక్ ఖాతాలో మరొక ప్లాప్?

Funky Review A Silly Over The Top Comedy Not Upto The Mark

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ కామెడీ శైలిని సృష్టించుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ. అయితే, ఆయన లేటెస్ట్ మూవీ ఫంకీ‘. నేడు వరల్డ్ వైడ్ గా ఈ ఈసినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ ముగించుకున్న ఈ సినిమా ఎలా ఉందంటే ”అనుదీప్ స్టైల్ లో వన్-లైనర్ జోకులు బాగానే పనిచేశాయి. చాలా వరకు నవ్వులు తెప్పిస్తాయి. ఒక దశలో కామెడీ మరీ శృతిమించి ‘చిరాకు’ తెప్పించే స్థాయికి వెళ్ళిందనిపిస్తుంది. ఫస్టాఫ్ టిపికల్ అనుదీప్ స్టైల్ వన్-లైనర్స్ మీద ఆధారపడి సాగుతుంది. సెకండాఫ్ లోను అదే రొటీన్ స్టఫ్. కొంత మేర నవ్వించిన గొప్పగా అనిపించదు. మెకానికల్ కుటుంబ విలువలపై అనుదీప్ ట్రోలింగ్ బాగుంది, కానీ హీరో,హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ మెప్పించలేదు.

Also Read : Vijay – Rashmika : విజయ్-రష్మిక పెళ్లి హక్కుల కోసం ఓటీటీ సంస్థ భారీ ఆఫర్

ఓవరాల్ గా చూస్తే మేకర్స్ చెప్పినట్టు సినిమాలో బలమైన కథ అంటూ ఏమీ లేదు. దర్శకుడి పాత సినిమాల మాదిరి ఈ సినిమా కూడా. కేవలం ప్రాసలు, సిల్లీ వన్-లైనర్లతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. కథ ఫిల్మ్ మేకింగ్ చుట్టూ ఉండే అడ్వాంటేజ్ తో దిల్ రాజు మరియు నాగ వంశీల సరదా అతిధి పాత్రలకు, దర్శకులు హరీష్ శంకర్, అనుదీప్, కళ్యాణ్ కృష్ణలు గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ సినిమాలో మేజర్ మైనస్ఎడిటింగ్. చాలా దారుణంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు ఒక ఫ్లో ఉన్న మూవీలా కాకుండా యూట్యూబ్‌లో కామెడీ క్లిప్స్‌ను ఒకదాని తర్వాత ఒకటి అతికించినట్లుగా అనిపిస్తుంది. ఇక డబ్బింగ్ విషయానికొస్తే.. అసలు సింక్ లేని వాయిస్‌లు ప్రేక్షకులకు అసహనం కలిగిస్తాయి. మాస్ కా దాస్ విష్వక్ సేన్ ఎనర్జీ గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఈ తరహా సిల్లీ కామెడీ విష్వక్‌కు ఏమాత్రం సెట్ అవ్వలేదు. అతను క్యారెక్టర్‌లో ఇమడలేక ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. అనుదీప్ రైటింగ్ చాలా రొటీన్‌ అయింది. అనుదీప్ ఇప్పటికీ జాతి రత్నాలు జోన్‌లో చిక్కుకున్నట్లు అనిపిస్తుందిమేకర్స్ చెప్పినట్టుగా కథ ఏమి లేకున్నా ‘ఫంకీ’  మిశ్రమ స్పందన రాబట్టింది.