చెవిలో గులిమి తీయాలా? వద్దా? నిజానిజాలేమిటి?
మీ చెవిలో గులిమిని తీస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే! అసలు కారణం తెలుసుకోండి. చాలా మందికి చెవిలో గులిమి తీయనిదే అస్సలు నిద్రపట్టదు. చెవులు శుభ్రంగా ఉండాలంటే గులిమిని ఎప్పటికప్పుడు తీయాలని కచ్చితంగా అనుకుంటారు. కానీ, వైద్యశాస్త్రం ప్రకారం ఇది నిజంగానే అవసరం లేదు. చెవిలోని చర్మం.. గులిమిని దానంతట అదే బయటకు నెట్టేస్తుంది. ఈ ప్రక్రియ సహజంగానే జరుగుతుంది.
చెవిలో గులిమి ఎందుకు అవసరం? చెవిలోని సెబేషియస్ గ్రంథుల స్రావాల వల్ల గులిమి అనేది తయారవుతుంది. ఇది చెవి మార్గాన్ని తేమగా ఉంచుతుంది. ఆ మార్గం ఎండిపోకుండా చూస్తుంది. బయటి నుంచి వచ్చే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, క్రిములు.. చెవి లోపలికి వెళ్లకుండా అడ్డుకునే సహజ రక్షణ కవచంలా ఇది పని చేస్తుంది. అదే దీని స్పెషల్
బడ్స్ ఉపయోగిస్తున్నారా? జాగ్రత్త! అగ్గిపుల్లలు, పిన్నీసులు లేదా కాటన్ బడ్స్‌తో గులిమిని తీయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పని వల్ల అది మరింత లోపలికి వెళ్లి కర్ణభేరి (Eardrum) దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. అందుకే ఇలాంటి పని చేయకండి.
చెవిలో గులిమిని ఎప్పుడు తీయాలి? కేవలం 1-2% మందిలో మాత్రమే గులిమి గట్టిపడి చెవి నొప్పి లేదా వినికిడి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలోనే ENT నిపుణులను సంప్రదించాలి. డాక్టర్లు ఆలివ్ ఆయిల్ లేదా ఇయర్ డ్రాప్స్ ద్వారా దాన్ని మెత్తబరిచి, మైక్రోస్కోపిక్ వ్యాక్యూమ్ సక్షన్ పద్ధతిలో చెవిలోని గులిమిని సురక్షితంగా తొలగిస్తారు. ఇంట్లో సొంత ప్రయోగాలు చేసి ఇబ్బంది పడడం కంటే.. నిపుణుల సలహా తీసుకోవడమే నిజంగా చాలా మంచిది. అందుకే చెవిలో గులిమిని సొంతంగ తీయవద్దు. మీకు చెవి నొప్పిగా ఉన్నా ఇతర ఏ ఇబ్బంది ఉన్నా.. వైద్య నిపుణుడిని సంప్రదించండి.
ముఖ్య గమనిక : ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గమనించండి. ఇది ఎలాంటి వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా.. వైద్య నిపుణులను సంప్రదించాలి.


Leave a Reply