Sirimalli

My WordPress Blog

Dale Steyn: నేపాల్కు డేల్ స్టెయిన్ బంపర్ ఆఫర్.. ఇంగ్లాండ్ను భయపెట్టడంతోనే..

Dale Steyn Offers Coach Nepal After England T20 World Cup Thriller

Dale Steyn: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ జట్టు ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ నేపాల్‌కు బంఫర్ ఆపర్ ప్రకటించారు. నేపాల్ జట్టుకి కోచింగ్ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో.. నేపాల్ బౌలర్ నందన్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యాడు. అయితే, నిన్న (ఫిబ్రవరి 8న) ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగింది. 185 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన నేపాల్ చివరి బంతి వరకూ పోరాడింది. చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమైన సమయంలో నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో నేపాల్ ఓడిపోయింది.

Read Also: Sanae Takaichi: జపాన్‌లో ఐరన్ లేడీ సనాయే తకైచి చారిత్రాత్మక విజయం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

అయితే, 2022 ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన నేపాల్ జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియా వేదికగా డేల్ స్టెయిన్ తన మద్దతును ప్రకటించారు. నేపాల్, ఎప్పుడైనా అవసరమైతే నేను మీకు కోచింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. పైకి, పైకి, ఇంకా పైకి! అని అతడు ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన నందన్ యాదవ్.. ఇది నేపాల్ క్రికెట్‌కు ఎంతో గర్వకారణమని అన్నారు. డేల్ స్టెయిన్ లాంటి లెజెండ్ మా గురించి మాట్లాడటం, మాకు సహాయం చేయాలని ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. దశాబ్దకాలం పాటు క్రికెట్‌ను ఏలిన ఆటగాడు మా గురించి ట్వీట్ చేయడం మాకు మరింత ప్రోత్సాహం అని మ్యాచ్ అనంతర ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు.

Read Also: Spirit : స్పిరిట్ నుండి ప్రకాష్ రాజ్ తప్పుకోవడానికి కారణం ఇదే..

ఇక, భవిష్యత్తులో డేల్ స్టెయిన్ నేపాల్‌కు కోచ్‌గా వస్తారా లేదా అన్నది జట్టు యాజమాన్యమే నిర్ణయిస్తుందని నందన్ యాదవ్ స్పష్టం చేశారు. ఆ నిర్ణయం మేనేజ్‌మెంట్ చేతిలో ఉంది.. మేము నేరుగా ఆయనను సంప్రదించలేం.. కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో నందన్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు (3–0–25–2).. జోస్ బట్లర్‌, హ్యారీ బ్రూక్ లను నందన్ ఔట్ చేశాడు. దీంతో 200కు పైగా స్కోరు చేసేలా కనిపించిన ఇంగ్లాండ్‌ను నేపాల్ బౌలర్లు 184/7కే కట్టడి చేశారు.

Read Also: Bhagwant Mann: పంజాబ్ సీఎంకు చుక్కెదురు.. భగవంత్ మాన్ విదేశీ టూర్‌కు కేంద్రం నిరాకరణ

కాగా, లక్ష్య చేధనలో కుషాల్ భుర్టేల్ దూకుడుగా ఆరంభించగా, రాహుల్ పౌడెల్- దీపేంద్ర సింగ్ ఐరీ జోడీ నిలకడగా ఆడుతూ నేపాల్‌ను పోటీలో నిలిపారు. ఇక, చివరి ఓవర్‌లో 10 రన్స్ అవసరమైనప్పుడు సామ్ కరన్ బౌలింగ్లో కేవలం 6 పరుగులే రావడంతో ఇంగ్లాండ్ 4 పరుగులతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.