Sirimalli

My WordPress Blog

Bhumana Karunakar Reddy: మరోసారి బీసీఐ విచారణకు అయినా సిద్ధం.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే దాడులు..

Attacks Part Of Diversion Politics Despite Apologies Bhumana Alleges

Bhumana Karunakar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దాడులు అన్నీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆరోపించారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి.. తాజా పరిణామాలపై తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి NDDB రిపోర్టులో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారని, అయితే సీబీఐ చార్జ్‌షీట్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదని స్పష్టంగా తేల్చిందని భూమన గుర్తుచేశారు. ఈ అంశంలో వాస్తవాలు బయటకు రావడంతో టీడీపీ, జనసేన ఆత్మరక్షణలో పడి ఎదురు దాడులకు దిగుతున్నాయని విమర్శించారు.

Read Also: Jogi Ramesh: హైకోర్టులో జోగి రమేష్‌, జోగి రోహిత్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌..

నెయ్యి కల్తీ దోంగలంటూ వైఎస్‌ జగన్‌, భూమన, వైవీ సుబ్బారెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని.. కానీ, ప్రజలు వాటిని నమ్మడం లేదని భూమన అన్నారు. ప్రజలు నమ్మడం లేదనే నిరాశతోనే ఇప్పుడు వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా కూడా మూడు వేల మందితో దాడులు చేయించారని భూమన మండిపడ్డారు.. రాంబాబు మాట్లాడిన మాటలను మేము సమర్థించడం లేదు.. అయినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాడులు జరగడం దుర్మార్గం అని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇప్పుడు రాంబాబు, జోగి రమేష్‌లపై వరుస దాడులు జరుగుతున్నాయని భూమన ఆరోపించారు. 2018లో భోలేబాబా డైరీకి అనుమతులు ఇచ్చింది చంద్రబాబే అని గుర్తు చేశారు.

ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు సీబీఐపైనే రివర్స్ ఎటాక్ చేస్తున్నారని విమర్శించిన భూమన, నిజంగా ధైర్యం ఉంటే సిట్‌తో కాకుండా సీబీఐతో మరోసారి విచారణ చేయించుకోవచ్చని సవాల్ విసిరారు భూమన.. విచారణకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేశారు. టెండర్ల నిబంధనలు సరళతరం చేయకముందే కొన్ని కంపెనీలకు అర్హత ఇచ్చిందీ చంద్రబాబే అని ఆరోపించిన భూమన, ఈ అంశాలన్నింటిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు తిరుపతి రాజకీయాలను మరింత వేడెక్కించాయి.