Sirimalli

My WordPress Blog

Band Melam: సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేస్తున్న నాని టీమ్!

Band Melam Movie Harsh Roshan Sridevi Hit Sentiment Analysis

హర్ష్ రోషన్ – శ్రీదేవి జంటగా నటించిన ‘కోర్ట్’ సినిమా ఎంతటి ఘనవిజయం సాదించిందో చేప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆ చిత్రంలోని ‘ప్రేమలో..’ అనే సాంగ్ ఒక ప్రధాన కారణం. 2025 వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఆ పాట అప్పట్లో చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఇదే జంట్ ‘బ్యాండ్ మేళం’ అనే మూవీతో రాబోతుంది. అయితే కోర్ట్ మూవీ లాగానే.. సరిగ్గా ఈ ఏడాది అదే ఫిబ్రవరి 13వ తేదీన ఈ సినిమాలోని కొత్త పాటను విడుదల చేసి ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్నారట మూవీ టీం.

Also Read : Ranveer Singh : సల్మాన్ తర్వాత ఇప్పుడు రణవీర్? గ్యాంగ్ వార్నింగ్‌తో వణికిపోతున్న బాలీవుడ్!

కేవలం పాటల విషయంలోనే కాకుండా, రిలీజ్ డేట్ విషయంలోనూ మేకర్స్ ‘కోర్ట్’ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నారు. గతేడాది మార్చి 13న విడుదలైన ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించగా, ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ను కూడా అదే తేదీన, అంటే 2026 మార్చి 13న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. వాలెంటైన్స్ డే సాంగ్ బజ్, అదే రిలీజ్ డేట్.. ఇలా వరుస సెంటిమెంట్లతో వస్తున్న ఈ సినిమా ‘కోర్ట్’ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో అని టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్‌ వాల్యూస్ ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయి.