Sirimalli

My WordPress Blog

Alia-Alpha : ఆలియా భట్ ‘ఆల్ఫా’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

Alia Bhatt Sharvari Alpha Movie Ott Release Rumours Clarity

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మొదటిసారిగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ఆలియా భట్‌తో పాటు శర్వరీ బాగ్ పవర్‌ఫుల్ స్పై ఏజెంట్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలతో, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రూపొందుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల అవుతుందంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. దీంతో ఆలియా అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ, తాజాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చి అందరినీ ఊరట కలిగించింది.

Also Read : Mrunal-Danush : “చెన్నై వాలా” అంటే ధనుషేనా? రిపోర్టర్ల ప్రశ్నలకు మృణాల్ ఠాకూర్ సిగ్గుల మొగ్గ!

‘ఆల్ఫా’ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ స్థాయిలో థియేటర్లలోనే విడుదల అవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలనే ఉద్దేశంతోనే విడుదల తేదీని ఏప్రిల్ 17, 2026కి వాయిదా వేశారు. ప్రస్తుతం ముంబైలోని YRF స్టూడియోలో ఆలియా, శర్వరీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ పాల్గొంటున్న చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోందట. స్పై యూనివర్స్‌లో వస్తున్న మొదటి ఫీమేల్ లీడ్ యాక్షన్ సినిమా కావడంతో, దీనిని బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నామని, ఓటీటీ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ తేల్చి చెప్పారు.