Sirimalli

My WordPress Blog

Ramayana : రాజమౌళి రేంజ్ ప్రమోషన్స్‌తో ‘రామాయణం’.. ఫస్ట్ లుక్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్!

Ranbir Kapoor Ramayana Movie Promotional Event Gateway Of India

భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో బాలీవుడ్ ‘రామాయణం’ ఒకటి. భారతీయ పురాణ ఇతిహాసం ‘రామాయణాన్ని’ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ సిద్ధమయ్యారు. సుమారు రూ. 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో (రెండు భాగాలకు కలిపి) రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడిగా కనిపిస్తుండగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే

Also Read : AA22 : బన్నీకి విలన్‌గా రష్మిక.. ‘AA22’లో శ్రీవల్లి ఊహించని ట్విస్ట్!

ఈ చిత్రంలో విలన్ పాత్ర అయిన రావణుడిగా కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash) నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరితో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్ వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆస్కార్ విన్నింగ్ కంపెనీ DNEG తో మేకర్స్ పని చేస్తున్నారు. అయితే ‘రామాయణం పార్ట్-1’ ఈ ఏడాది (2026) దీపావళి కానుకగా విడుదల కానుండగా.. ఈ సినిమా కోసం మేకర్స్ ఒక భారీ ప్రమోషనల్ ప్లాన్ సిద్ధం చేశారు. దర్శకధీరుడు రాజమౌళి తన సినిమా వారణాసి కోసం వంటి పుణ్యక్షేత్రాల్లో చేసే గ్రాండ్ ఈవెంట్స్ బాటలోనే, ఈ చిత్ర బృందం కూడా ముంబైలోని ఐకానిక్ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఒక భారీ వేడుకకు ప్లాన్ చేస్తోంది. కాగా ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా ఈ ఈవెంట్ జరగబోతోంది.

ఈ వేడుకలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ సహా ప్రధాన తారాగణం అందరి ఫస్ట్ లుక్స్‌ను రివీల్ చేయనున్నారు. రాజమౌళి ఏ విధంగానైతే ‘RRR’ లేదా ‘బాహుబలి’ చిత్రాలకు నేషనల్ లెవల్‌లో హైప్ క్రియేట్ చేశారో, నితేష్ తివారీ టీమ్ కూడా అదే స్థాయిలో ప్రమోషన్స్ చేయబోతోందట. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరి రాజమౌళి మార్కు ప్రమోషన్స్ ఈ చిత్రానికి ఏ స్థాయిలో మైలేజ్ ఇస్తాయో వేచి చూడాలి.