మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 6, 7, 9, 10, 11వ వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే మందుల సామేల్ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. రాజన్నగూడెం, ఆరెగూడెం, ఇందిరానగర్, సాయిబాబా కాలనీ, వడ్డెర కాలని, ధర్మాపురం, గాంధీనగర్ కాలనీల్లో సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తానన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని, కాంగ్రెస్ గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పైల సోమిరెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, బద్దం నాగార్జున రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






