Sirimalli

My WordPress Blog

శ్రీ‌వారి ల‌డ్డూపై రాజ‌కీయం చేస్తున్నారు: విహెచ్ పి నేత

హైదరాబాద్: శ్రీ‌వారి ల‌డ్డూపై రాజ‌కీయం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ తెలిపారు. దయచేసి రాజకీయ పార్టీలు తిరుపతి లడ్డూని రాజకీయాల కోసం వాడుకోవద్దని కోరుతున్నామన్నారు. ఎపి రాజకీయాలతో ధార్మికతకు, భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లుతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో  అక్రమ గోరవాణా , గోవధ సాగుతోందని, కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవిత్ర తిరుమల లడ్డూను పార్టీలు రాజకీయ అంశంగా మార్చవద్దని కోరారు. రాజకీయ పరస్పర ఆరోపణలకు తిరుమలను వేదిక చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూ విషయంలో లోతైన దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విహెచ్ పి నేత డిమాండ్ చేశారు. లడ్డూ విషయంలో రాజకీయ నాయకులు మాట్లాడొద్దని కోర్టు హెచ్చరించిన కూడా పట్టించుకోవడం లేదని విహెచ్‌పి నేత మండిపడ్డారు. కోర్టు తీర్పు ఇస్తుందని, తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడుతుందని, కోర్టులు విధించే శిక్షలను ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రత, హిందువుల మనోభావాల విషయంలో హిందూ సమాజానికి చేదోడుగా ఉంటామని విహెచ్‌పి నేత స్పష్టం చేశారు.