హైదరాబాద్: మూడంతస్థుల భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత అనే యువతి(23) హైదరాబాద్లోని కెపిహెచ్బిలో నివసిస్తోంది. సిబిసిఐడి కాలనీలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది. ప్రైవేటు కంపెనీలోని భవనం పైనుంచి దూకింది. వెంటనే ఆమెను నిజాంపేటలోని శ్రీశ్రీహోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







