మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో /చొప్పదండి: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన- ప్ర గతి బాట కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగసభలో సీఎం పా ల్గొని మాట్లాడారు. బిఆర్ఎస్ నేతలకు బిజెపి రక్షణగా నిలిచిందని రేవంత్ అరోపిం చారు. చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ ఎన్నికల లోపు ముగ్గురు బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవ దానం చేసి బీజేపీని 8 స్థానాల్లో గెలిపించిందన్నా రు.అసెంబ్లీ సాక్షిగా తీర్మా నం చేసి కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి పంపించామన్నారు.ఆరు నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేద న్నారు. కాళేశ్వరం కేసీఆ ర్కు ఏటీఎంగా మారిందన్న ప్రధాని ఎందుకు సీబీఐ విచారణ చేపట్టలేదన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ పై విచారణకు అనుమతి కోరుతూ లేఖ రాస్తే ఇప్పటికే స్పందన లేదన్నారు.
కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ది చీకటి ఒప్పందమన్నారు. రెండేళ్లలో ఏం చేశారని బీజేపీ, బీఆర్ఎస్ మమ్మల్ని ప్రశ్నిస్తోందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, పన్నెండేళ్లల్లో మోడీ ఏం చేశారో చర్చిద్దాం రండి అని, రెండేళ్లలో మేం ఏం చేశామో చెబితే మీ గుండెలు పగులుతాయ్ అని అన్నారు. నిరుద్యోగులకు 70 వేల ఉ ద్యోగాలు భర్తీ చేశామన్నారు.70 వేల మంది తలలు లెక్కపెడదాం ధైర్యముంటే ఎల్బీస్టేడియంకు రండి, వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచామన్నారు. చొప్పదండిలో డిగ్రీ కాలేజీ నిర్మిస్తున్నామన్నారు. రైతులకు 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.2 లక్షల వంతున రుణమాఫీ చేశామన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అం దించామన్నారు. కేవలం రైతుల కోసమే రెండేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేశామన్నారు. సన్న వడ్ల కు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించామన్నారు.
వరి వేస్తే ఉరి అని మీరంటే.. రైతులు పండించిన ప్రతీ గింజ మా ప్రభుత్వం కొంటుందన్నారు. వ్యవసాయం పండుగ చేసి చూపిస్తున్నామన్నారు. ఆడబిడ్డలు క ట్టుకునే చీరల్లో కూడా గత ప్రభుత్వంలో కమిషన్లు తీసుకున్నార న్నారు. మా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రెండేళ్లల్లో రూ.9 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రెండేళ్లలో రూ. 27 కోట్లు మహిళలకు రుణాలు అందించి వ్యాపారంలో ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని అప్పులపాలు చేసి పోయి కెసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నాడని,ఆయన సడ్డకుని కొడుకు.. ఇసుకనే కాదు మిడ్ మానేరు ఇండ్లను కూడా వదలలేదన్నారు. మందు అప్పటోలనే.. మూలుగుడు మునుపటోలనే అన్నట్లు కేసీఆర్ వ్యవహార శైలి ఉందన్నారు. 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు.ఎకో టూరిజంను అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చి దిద్దుతామన్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ దర్శనానికి కేసీఆర్, కేటీఆర్, హ రీశ్ రాలేదన్నారు. పేదోళ్ల దేవుళ్లను మొక్కేందుకు వాళ్లకు నామోషీ అని, బీఆరెస్ ఎన్ని శాపనా ర్ధాలు పెట్టినా మరో ఎనిమిదేళ్లు అధికారం మాదేనన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.కరీంనగర్‌కు ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. వరంగల్, కరీంనగర్ జంట నగరాలుగా అభివృద్ధి చేసి రెండింటి మధ్యలో డంప్ యార్డు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. బండి, గుం డు తెచ్చేదేం లేదు.. మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్లకు లేదన్నారు. బండి సంజయ్ మాపై రంకెలేయడం కాదన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసి కెసీఆర్‌ను బొక్కలో వేయించాలన్నారు.
ఒక్క సీటు కూడా బీజేపీని గెలవనీయరు..
నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దమనిషి పాలమూరుకు వచ్చిండని, బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ మీ జాతీయ నాయకులందరినీ తీసుకరావాలన్నారు. మా కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీని గెలవనీయరని అన్నారు.గతంలో పాలమూరుకు వచ్చిన ప్రధాని మోదీ పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామన్నారు. రాష్ట్రానికి వచ్చిన జాతీయ అధ్యక్షుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదన్నారు. మెట్రో రైలు రెండో విడత గురించి మాట్లాడలేదని, కాళేశ్వరం విచారణపై మాట్లాడలేదన్నారు. మూసీ ప్రక్షాళన నిధుల ఊసు ఎత్తలేదు..ఏం మొహం పెట్టుకుని బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రానికి ప్రచారానికి వస్తున్నారు? అని ఆరోపించారు.
కరీంనగర్ బండి ఎన్ని నిధులు తెచ్చారు..?
కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలన్నారు. ఎవ్వ రు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు.. మున్సిపల్ ఎన్నికల్లో మంచి వాళ్లను ఎన్నుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. మళ్లీ వస్తా.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీఫామ్ దక్కడం మీ అదృష్టం
మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. రెండేళ్లల్లో ఎన్నో సంక్షేమ పథకాలను అందించామన్నారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. అ ధికార పార్టీలో టికెట్ ఆశించే వాళ్లు ఎక్కువగా ఉండటం సహజమన్నారు. ఎంతో మంది పో టీ పడ్డా.. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ దక్కడం మీ అదృష్టమన్నారు. ఒక్క ఓటు కూడా గెలుపు ఓట ములను నిర్ణయిస్తుందన్నారు. టికెట్ రానివారిని కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు.
పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రూ.45.15 కోట్లతో కరీంనగర్ జిల్లా రామడుగులో అడ్వాన్ స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు,రూ. 5 కోట్లతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మ ధురానగర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి,పలు అభివృద్ధి పనులకు మంత్రులు తు మ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలతో కలసి సీఎం శంకుస్థాపన చేశారు.
మానవత దృక్పథం చాటిన వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు హాజరైన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ 58వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సర్దార్ ధన్నాసింగ్ గురువారం సాయంత్రం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, ధన్నాసింగ్ను తన స్వంత వాహనంలో చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బందితో దగ్గరుండి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం అంబులెన్స్ ఏర్పాటు చేసి కరీంనగర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడిన వెలిచాల రాజేందర్ రావు, ధన్నాసింగ్కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన ధన్నాసింగ్ను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వెలిచాల రాజేందర్ రావును పలువురు కాంగ్రెస్ నాయకులు, ధన్నాసింగ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వెలిచాల రాజేందర్ రావ్ తక్షణం స్పందించి మానవత దృక్పథం చాటుకోవడం విశేషం.







