
2024లో వచ్చిన మలయాళ చిత్రం ప్రేమలు. తెలుగులోను సంచలన విజయం సాధించిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు గతంలో. అయితే, 2026 ప్రారంభం నాటికి కూడా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే డిస్కషన్స్ ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. అయితే కథ విషయంలో హీరోకి దర్శకుడికే మధ్య విభేదాలు అలాగే స్క్రిప్ట్ సరిగ్గా కుదరకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారని మాలీవుడ్ లో వార్తలు అప్పట్లో వినిపించాయి.
Also Read : NBK 111 : బాలయ్య కోసం గోపించంద్ మలినేని భారీ ప్లానింగ్
దర్శకుడు గిరీష్ ఏడీ ప్రస్తుతం మమితా బైజు, నివిన్ పాలీలతో కలిసి ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ అనే చిత్రంలో బిజీగా ఉన్నారు. అటు హీరోగా చేసిన నస్లీన్ కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొదటి భాగంతో స్టార్ డమ్ తెచ్చుకున్న నస్లెన్ మరియు మమితా బైజు ప్రేమలు 2 కాల్షీట్లు సర్దుబాటు చేసే పరిస్థితిలో కూడా లేరట. మొదటి భాగానికి మించిన మ్యాజిక్ చేయాలంటే పక్కా స్క్రిప్ట్ ఉండాలి అందుకే కథను మళ్ళీ మళ్ళీ రీరైట్ చేసిన కూడా పర్ఫెక్ట్ రాలేదట. దాంతో ఈ సినిమి మేకర్స్ అయిన ‘భావన స్టూడియోస్’ ప్రేమలు 2 ను రద్దు చేసేసారు. ఫస్ట్ పార్ట్ భారీ హిట్ కావండతో సెకండ్ పార్ట్ పై ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. స్క్రిప్ట్ సరిగా రాకపోవడంతో ప్రేమలు2 ను అరకొరగా తెరకెక్కించి వాల్యూ తగ్గించే బదులు అసలు చేయకుండా ఉండడం మంచిదని మొత్తానికే ఈ సీక్వెల్ ను రద్దు చేసారు మేకర్స్.





