Sirimalli

My WordPress Blog

విశాఖలో అర్ధరాత్రి బాంబు కలకలం

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం ప్రాంతంలో అర్ధరాత్రి బాంబు కలకలం సృష్టించింది. చెత్తకుప్పలో ఉన్న ఓ స్కూల్ బ్యాగ్‌లో లైటింగ్ బ్లింకింగ్ కనిపించడంతో స్థానికులు అనుమానంతో 112కు కాల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పరీక్షల అనంతరం బ్యాగ్‌లో ఉన్నది బాంబు కాదని, పిల్లలు ఆడుకునే లైటింగ్ ఉన్న బొమ్మ మాత్రమేనని గుర్తించారు.

The post విశాఖలో అర్ధరాత్రి బాంబు కలకలం appeared first on Navatelangana.