నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా బ్యాంకులు మార్చి 31న పనిచేస్తాయి. మహావీర్ జయంతి సందర్భంగా గతంలో ప్రకటించిన సెలవును ఆర్బీఐ రద్దు చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రభుత్వ రసీదులు, చెల్లింపు లావాదేవీలను నిర్వహించే బ్యాంక్ శాఖలను మార్చి 31న తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరింది. దీంతో ప్రభుత్వ వ్యాపారంతో అనుసంధానించబడిన శాఖలు యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. అయితే, వినియోగదారులు బ్రాంచ్‌ను సందర్శించే ముందు సిబ్బందితో ధృవీకరించుకోవడం మంచిది.
The post మార్చి 31న బ్యాంకులు తెరిచే ఉంటాయి: ఆర్బీఐ appeared first on Navatelangana.





