Sirimalli

My WordPress Blog

మార్కాపురం జిల్లాలో జూనియర్ టెక్సికల్ అసిస్టెంట్ ఆత్మహత్య

అమరావతి: అధికారుల వేధింపులకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా డోర్నాలలో జరిగింది. ప్రసాదరావు(47) అనే వ్యక్తి ఉపాధిహామీ పథకంలో జూనియర్ టెక్సికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఐటిడిఎ ఆఫీస్ వ‌ద్ద చెట్టుకు ఉరి వేసుకొని ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నతాధికారుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమంటూ అధికారిక వాట్సాప్ గ్రూపు లో ప్రసాదరావు మెసేజ్ చేసినట్టు సమాచారం సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన కుమారుడి చావు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.