Sirimalli

My WordPress Blog

అండర్19 ప్రపంచకప్‌.. నేడు అఫ్గాన్‌తో భారత్ సెమీస్ పోరు

బులవాయో: అండర్19 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇందులో గెలిచే జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో యువ భారత్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. అంతేగాక మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్లు జట్టులోఉన్నారు. దీంతో భారత్‌కే ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్ వంటి స్టారర్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ జట్టుకు కీలకంగా మారాడు. అయితే కెప్టెన్ ఆయుష్ మాత్రె ఫామ్ జట్టును కలవరానికి గురి చేస్తోంది. మాత్రె కనీసం ఈ మ్యాచ్‌లోనైనా తన బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంది. మరోవైపు అఫ్గాన్‌లో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఆ జట్టు కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.