Sirimalli

My WordPress Blog

మాజీ ఎంఎల్ఎ పాషాఖాద్రి మృతి

మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి(71) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఖాద్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతిచెందారు. అహ్మద్ పాషా ఖాద్రి ఎంఐఎం పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మూడు సార్లు చార్మినార్ నియోజకవర్గం నుంచి, ఒకసారి యాకత్‌పుర నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఖాద్రి ఎంఐఎం అధినేత దివంగత సుల్తాన్ సలావుద్దిన్ ఓవైసీ, ఎంపి అసదుద్దిన్‌లకు అత్యంత సన్నిహితుడు. మాజీ ఎమ్మెల్యే ఖాద్రి మృతికి పలువురు సంతాపం తెలిపారు.