Sirimalli

My WordPress Blog

Ajith Kumar : అజిత్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమా..

Ajiths Ak64 With Adhik Ravichandran Anil Sunkara To Produce This Film

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా గతేడాది వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద  సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే గత కొంతకాలంగా అజిత్ నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చ నడుస్తోంది. అయితే డైరెక్టర్ ఆధిక్ ఇప్పుడు అజిత్ కోసం మరో పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. AK64 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.

Also Read : Varanasi : వారణాసి లేటెస్ట్ అప్డేట్.. జార్జియాకు టికెట్ బుక్ చేసుకున్న మహేశ్ బాబు

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ (AK Entertainments) నిర్మించబోతుందట. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ వ్యయంతో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అజిత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అధిక్ రవిచంద్రన్ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. అజిత్ చిత్రం కోసం అజిత్ ఏకంగా రూ. 170 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఒక టాలీవుడ్ నిర్మాణ సంస్థ తమిళ హీరోకు ఈ స్థాయి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘AK64’పై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయండంలో సందేహమే లేదు.