Sirimalli

My WordPress Blog

US India Trade Deal: ట్రక్‌లోకి ట్రంప్-మోడీ దోస్తాన్.. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌పై తక్కువ సుంకాలు..

Us India Trade Deal Trump Modi Tariff Cut

US India Trade Deal: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీ దోస్తాన్ గురించి తెలిసిందే. ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసలు చేసుకోవడం కామన్. అయితే.. ట్రంప్ తీసుకున్న టారీఫ్ పెంపు నిర్ణయంతో ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ట్రంప్ మోడీ స్నేహానికి బ్రేక్ పడిందని భావించారు. తాజాగా ట్రంప్, మోడీ చేసిన ప్రకటనలు ఇప్పుడు మళ్లీ వీరి స్నేహాన్ని బలపరిచాయి. అమెరికా–భారత్ మధ్య చాలా రోజులుగా నడుస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలకు ఇప్పుడు కొంత ఊరట కలిగే వార్త వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందంతో భారత వస్తువులపై ఉన్న భారీ పన్నులు గణనీయంగా తగ్గాయి. ఇప్పటివరకు అమెరికా భారత్ నుంచి వచ్చే వస్తువులపై మొత్తం 50 శాతం పన్ను వసూలు చేస్తోంది. ఇందులో 25 శాతం పరస్పర పన్ను కాగా, మరో 25 శాతం రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించిన అదనపు శిక్ష పన్ను. ఇప్పుడు కొత్త ఒప్పందం ప్రకారం ఆ అదనపు శిక్ష పన్నును అమెరికా పూర్తిగా తీసేసింది. మిగిలిన పన్నును సైతం తగ్గించి 18 శాతానికి పరిమితం చేసింది.

READ MORE: Paradise :‘పారడైజ్’ కోసం కలెక్షన్ కింగ్ రెమ్యూనరేషన్ వైరల్

వైట్ హౌస్ అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించిన శిక్ష పన్ను ఇక భారత్‌పై ఉండదు. దీని వల్ల భారత్‌కు పెద్ద ఊరట లభించింది. కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తే, భారత్ ప్రాంతంలోని ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో నిలుస్తుంది. ఇండోనేసియా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల కంటే భారత్‌పై పన్ను తక్కువగా ఉంటుంది. చైనా, పాకిస్థాన్ లాంటి దేశాలతో పోలిస్తే అయితే భారత్‌కు చాలా తక్కువ పన్ను పడనుంది. ఇతర దేశాలపై అమెరికా విధిస్తున్న పన్నులను చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. చైనాపై 37 శాతం పన్ను ఉంది. బ్రెజిల్‌పై అయితే ఏకంగా 50 శాతం. దక్షిణాఫ్రికాపై 30 శాతం, మయన్మార్, లావోస్‌లపై 40 శాతం చొప్పున పన్ను ఉంది. మరోవైపు యూరోప్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌లపై 15 శాతం మాత్రమే. బ్రిటన్‌పై ఇంకా తక్కువగా 10 శాతం పన్ను ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో బంగ్లాదేశ్, వియత్నాంపై 20 శాతం, మలేషియా, కంబోడియా, థాయ్‌లాండ్, పాకిస్థాన్‌లపై సుమారు 19 శాతం పన్ను ఉంది. ఈ లెక్కలన్నింటిని చూస్తే, భారత్ ఇప్పుడు అమెరికా ప్రధాన మిత్రదేశాలకు దగ్గరైన స్థాయిలోకి వచ్చిందని చెప్పవచ్చు.

READ MORE: Double Murder: అనంతపురంలో జంట హత్యల కలకలం.. తల్లి, కొడుకు దారుణ హత్య