Sirimalli

My WordPress Blog

150కు పైగా కాకులు మృతి.. బర్డ్ ఫ్లూ నిర్ధారణ

నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో వందలాది కాకులు బర్డ్ ఫ్లూతో మరణించినట్లు నిర్ధారణ అయింది. జనవరి 11న నౌగాచియా సబ్‌డివిజన్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు అప్రమత్తమై, ప్రభావిత ప్రాంతంలో శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టి, కోళ్ల ఫారాల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రజలు అనారోగ్యంతో ఉన్న లేదా మరణించిన పక్షులను తాకవద్దని, అనుమానిత మరణాలను వెంటనే అధికారులకు నివేదించాలని సూచనలు జారీ చేశారు.

The post 150కు పైగా కాకులు మృతి.. బర్డ్ ఫ్లూ నిర్ధారణ appeared first on Navatelangana.