సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘దక్షిణ కాళీ‘. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. ఆధ్యాత్మిక కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తోట కృష్ణ. ఈ సినిమా ఈ నెల 6న తెలుగు, తమిళ, కన్నడలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్ర సాంగ్స్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకుడు వి.సముద్ర, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ అమ్మవారి మహిమలు తెలిపేలా దక్షిణ కాళీ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ఓ కీలక పాత్రలో నటించానని తెలిపారు. నిర్మాత సత్యవాణి మీసాల మాట్లాడుతూ సినిమా నిర్మాణం నుంచి రిలీజ్ దాకా అమ్మవారే మమ్మల్ని నడిపిస్తూ వచ్చారని అన్నారు.





