న్యూఢిల్లీ : పార్లమెంట్హౌస్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఎన్‌డిఎ కూటమి భాగస్వాములైన బీజేపీ, టిడిపి, జెడి(యు),ఎల్జెపి (ఆర్), శివసేన,జెడి(ఎస్)తదితర పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో రాజకీయ, పాలనా వ్యవహారాలపై పార్లమెంట్ లోని ప్రభుత్వ అజెండాపైన ప్రధాని మోడీ చర్చించడం ఆనవాయితీ. ఎంపీలు తమ నియోజకవర్గాల సమస్యలపై లేవనెత్తే అంశాలపై ప్రధాని తరచుగా చర్చిస్తుంటారు.





