Sirimalli

My WordPress Blog

రెండు గంటల్లో బాలుడి ఆచూకీ గుర్తించిన మియాపూర్ పోలీసులు 

– తప్పిపోయిన బాలుడిని రెండు గంటల్లో తల్లిదండ్రులకు  చేర్చిన పోలీసులు 
నవతెలంగాణ – మియాపూర్ : తప్పిపోయిన రెండు గంటల్లోనే బాలుడి ఆచూకీ కనుగొని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన మియాపూర్ పోలీసులు. ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ కాలనీకి చెందిన రాజేష్ కొడుకు సిద్ధార్థ్ (5) సోమవారం ఉదయం ఇంటి బయట ఆడుకుంటూ ఒక కిలోమీటర్ దూరం వెళ్లి తప్పిపోయాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మియాపూర్ పోలీసులు బాలుడిని గుర్తించి రెండు గంటల పాటు శ్రమించి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాలుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్న నేపథ్యంలో పోలీసులే ముందస్తుగా తమ బాబును గుర్తించి వారికి క్షేమంగా అప్పగించడం పై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

The post రెండు గంటల్లో బాలుడి ఆచూకీ గుర్తించిన మియాపూర్ పోలీసులు  appeared first on Navatelangana.