ఐపిఎల్‌లో అన్‌సోల్డ్.. క్రిస్‌ గేల్ రికార్డు బద్దలుకొట్టిన కివీస్ ఓపెనర్

Finn Allen

కాలిఫోర్నియా: అమెరికాలో జరుగుతున్న మేజర్ క్రికెట్ లీగ్-2025లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ ఆలెన్ (Finn Allen) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లీగ్‌లో సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆలెన్ శుక్రవారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 296 స్ట్రైక్‌ రేటుతో కేవలం 51 బంతుల్లో 151 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లుతో పాటు.. ఏకంగా 19 సిక్సులు బాదాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను బద్దలు కొట్టాడు. కేవలం 49 బంతుల్లోనే 150 పరుగుల స్కోర్ దాటి.. టి-20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగుల స్కోర్ దాటిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. 34 బంతుల్లోనే ఆలెన్ బాదిన శతకం టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత వేగంవంతమైన సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన కివీ క్రికెటర్‌గా కూడా ఫిన్ అలెన్ నిలిచాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని నెలల క్రితం ఐపిఎల్ వేలంలో ఫిన్ ఆలెన్‌ని (Finn Allen) కూడా రూ.2కోట్ల బేస్ ధరకి వేలం వేశారు. కానీ, అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఇప్పుడు అతని మేజర్ క్రికెట్ లీగ్‌లో సంచలనం సృష్టించాడు. అంతేకాక, ఇక టి-20 ఇన్నింగ్స్‌లో 19 సిక్సులు కొట్టి ఆలెన్ క్రిస్‌గేట్ రికార్డును బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో గేల్ ఓ మ్యాచ్‌లో 18 సిక్సులు కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆలెన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో యూనికార్న్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్‌ 13.1 ఓవర్లలో 146 పరుగలకే ఆలౌట్ అయింది. దీంతో యూనికార్న్స్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది. లీగ్ చరిత్రలో ఇంత భారీ తేడాతో విజయం సాధించడం ఇదే తొలిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *