Sirimalli

My WordPress Blog

నాన్న నేర్పిన పాఠాలే..

గ్లామర్ ప్రపంచంలో వెలుగులు ఎప్పటికీ నిలవవని, స్టార్‌డమ్ శాశ్వతం కాదని టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేర్కొంది. తాజాగా ఆమె మాట్లాడుతూ “సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పుడే హీరోయిన్లు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. లేకపోతే కెరీర్ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేతి నిండా సినిమాలు ఉన్నప్పుడే సంపాదనను సరైన దిశలో మళ్లించాలి. నటీనటుల కెరీర్ ఎప్పుడెప్పుడు మలుపు తిరుగుతుందో చెప్పలేమని, కాబట్టి ముందుగానే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఏర్పరుచుకోవాలి. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల నుంచే నా ఆర్థిక వ్యవహారాలన్నీ మా నాన్నే చూసుకున్నారు. ఖర్చు, పొదుపు, పెట్టుబడుల విషయంలో ఆయన చూపిన క్రమశిక్షణే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నాన్న నేర్పిన పాఠాలే నన్ను రియల్ ఎస్టేట్, జ్యువెలరీ బిజినెస్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చేశాయి”అని అన్నారు.