Sirimalli

My WordPress Blog

కడపలో.. రాజంపేట దీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కడప జిల్లా అర్థరాత్రి రాజంపేట దీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ లాడ్జి రిసెప్షన్ లో పని చేస్తున్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్రిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కిటికీలు, డోర్లు పగలగొట్టి 39 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.