Sirimalli

My WordPress Blog

తయారీ రంగంలో అగ్రస్థానమే లక్ష్యం

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణను మా న్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొ న్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని సి ఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గ్లోబల్ ట్రెం డ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డితో శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాల గురించి వారిద్దరూఊ మాట్లాడారు. దీంతోపాటు ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభా వం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాల గురించి శంతనునారాయణ్ సిఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని సిఎం కోరారు.