మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు బుధవారం(ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జ రుగనున్నాయి. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథ మ సంవత్సరం విద్యార్థు లు 4,89,126 మంది, రెండో సంవత్సరం ప్రైవేటు 54,017 మంది కలిపి మొత్తం 5,07,949 మంది విద్యార్థు లు పరీక్షకు హాజరు కానున్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డ్యుయల్ డెస్క్ ఏర్పాట్లు చే శారు.
ప్రతీ కేంద్రంలో తాగునీటితో విద్యార్థులు అవసరమైతే వైద్య సహాయం అందించేందుకు అవసరమైన మందులు మెడికల్ సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇం టర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాం డ్ కంట్రోల్ ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్(బిఆన్‌ఎస్ 163) అమలులో ఉంటుంది. ప రీక్షా కేం ద్రాల గుర్తింపు కోసం హాల్ టికెట్లపై క్యూ ఆర్ కోడ్‌లను ముద్రించా రు. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉం చారు. దాంతోపాటు విద్యార్థుల ఫోన్లకే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్లు పంపించారు. విద్యార్థులు ఎస్‌ఎంఎస్ లింకుపై క్లిక్ చేసి విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఐదు నిమిషాల వరకు గ్రేస్ టైం
ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ప రీక్షా సమయానికి అరగంట ముందు పరీక్షా కేం ద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఉదయం 9 గంటల తరువాత 5 నిమిషా లు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా కూడా అనుమతిస్తామని ఇప్పటికే ఇంటర్ బోర్డు కార్యదర్శి కృ ష్ణ ఆదిత్య వెల్లడించారు. తాము ఇచ్చే 5 నిమిషాల గ్రేస్ పిరియడ్‌ను సానుకూల దృక్పథంతో చూడాలని, విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రాలకు చే రుకుని తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవ డం వల్ల ప్రశాంతంగా పరీక్షలు రాయగలుగుతాయని తెలిపారు. ము ఖ్యంగా ట్రాఫిక్ రద్ధీ ఉండే ప్రాంతాలలో విద్యార్థులు పరీక్షా సమయం కంటే ముందే చేరుకోవాలని, తద్వారా ఒఎంఆర్ షీట్ ప్రశాంతం గా నింపుకోవచ్చని, హడావుడి ఉండదని చెప్పారు. అందుకే పరీక్షా సమయానికి అరగంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోని మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వ స్తువులు, ప్రిటెండ్ మెటీరియల్స్‌కు అనుమతి ఉండదు.







