బెంగళూరు: స్నేహం పేరుతో ఓ యువతిని నమ్మించి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏడు కోట్ల రూపాయలు కాజేశాడు ఓ మోసగాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆయుష్ అనే విద్యార్థి ఓ యువతి పరిచయం పెంచుకొని స్నేహంగా ఉండేవాడు. స్నేహం పేరుతో యువతిని నమ్మించాడు. తన బ్యాంకు ఖాతా సాంకేతిక సమస్య రావడంతో డబ్బులు కావాలని అడిగాడు. దీంతో ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఎటిఎం, పాస్ బుక్, చెక్ బుక్ కార్డులను అప్పగించింది. ఆమె ఇచ్చిన కొన్ని రోజులలోనే ఆమె ఖాతా నుంచి ఏడు కోట్ల రూపాయలు ఖాళీ కావడంతో బ్యాంకు అధికారులను సంప్రదించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకు అధికారులు ఆమె ఖాతాను స్తంభింప చేశారు.





