Sirimalli

My WordPress Blog

ఎవరు లెక్కిస్తారు?

గాయాల అలల మధ్య

జీవితం

ఛిద్రమైన అద్దం కదలికల్లో

ఉశ్చాస నిశ్వాసలు

ఎవరు లెక్కిస్తారు?

రాల్చిన కన్నీటి బొట్లను

ఆడిన అబద్దాలను

హింసించిన వ్రణాలను

ఎవరు రుచి చూస్తారు?

పోనీ-

కూలిన జ్ఞాపకాలను

కలల భవంతులను

ఇళ్ళు కూలిన పునాదులను

శిధిలాలను

జనావాసాల్లో పేరుకున్న

రక్తపు మడుగులను

స్పందనల అలలను

ఎవరు చూసి ఆనందిస్తారు?

దుఃఖిత స్వరాల ఆర్తనాదం

బుల్డోజర్ల రణగొణ ధ్వనుల సంగీతం

చావు డప్పుల వెనక బతుకు నృత్యం

దింపుడు కల్లం ఆశ బతుకుతుందా?

అక్కడక్కడ

దండు మూగుతున్నది

వేల, వేల జులూసులుగా

నిద్రలు నటిస్తున్న

పిరికి వాళ్ళ చెవులు చిల్లులు పడేవరకు

నృత్యం చేయాల్సిందే

– హనీఫ్