Sirimalli

My WordPress Blog

Vishwak Sen : ఎవడు ఏమనుకున్నా ‘ఫంకీ’ నాకు హిట్ సినిమానే

Funky Is A Hit For Me Vishwak Sen Bold Statement Despite Criticism

విశ్వక్ సేన్ హీరోగా కేవీ అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఫంకీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ లో రూపొందించిన ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీసం మినిమం ఓపెనింగ్ కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌పై హీరో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 

Also Read : Vijay – Rashmika Marriage : విజయ్ – రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ వివాదాస్పద వ్యాఖ్యలు

విశ్వక్ సేన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్ట్ సినిమా టీజర్ లంచ్ లో ఫంకీ రిజల్ట్ పై స్పందిస్తూ ‘ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకున్నా, విమర్శకులు ఏమని రాసినా తాను మాత్రం తగ్గేదే లే “ఎవడు ఏమనుకున్నా Funky నాకు హిట్ ఏ’ సినిమా మేకింగ్ విషయంలో తాను ఎక్కడా రాజీ పడలేదని, తనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చింది. నేను ఒక గొప్ప సినిమా చేశాను’ అని అన్నాడు. ఈ కామెంట్స్ పై విశ్వక్ ఫ్యాన్స్ సమర్దిస్తుంటే ట్రేడ్ వర్గాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. సినిమా బాగుంటే హిట్ అని మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఆడియెన్స్ నిర్ణయిస్తారు, అలా కాకుండా ప్లాప్ అయినా కూడా హిట్ అని చెప్పుకోవడం ఏంటో, ప్రేక్షకుల తీర్పును గౌరవించాలని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా, తన సినిమాపై ఈ స్థాయిలో కాన్ఫిడెన్స్‌తో ఉండటం ఇప్పుడు పరిశ్రమలో చర్చకు దారితీసింది. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ చేస్తున్న కల్ట్ తో అయిన హాట్ కొట్టి విశ్వక్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.