నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటకలోని గదగ్ జిల్లా శిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాణి కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. లోకాయుక్త అధికారులు శనివారం దాడులు నిర్వహించి, ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విజయ పూజార్ అనే కాంట్రాక్టర్ గదగ్ జిల్లా సంకదాళ గ్రామంలో రోడ్డు మరమ్మతు, ప్రహరీ నిర్మాణ పనులను దక్కించుకున్నారు. రూ.కోటి విలువైన ఈ పనులకు ఎమ్మెల్యే రూ.11 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
The post లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.





