మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, ఓ ఛానెల్ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి సోదరుల తండ్రి రాఘవేందర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం రెడ్యాల గ్రా మంలో పర్యటించి వెన్నం సోదరులను పరామర్శించినున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల కు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు రెడ్యాల చేరుకుంటారు. అక్కడ వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, మధ్యాహ్నం 3 గంటలకు రెడ్యాల నుంచి బయలుదేరతారు. మధ్యాహ్నం 3.30కు దేవాదుల ప్రాజెక్టు కు చేరుకుని, ప్రాజెక్టు ను సందర్శించి, ఇంజనీర్లతో సిఎం సమీక్ష నిర్వహిస్తారు.





