అమరావతి: ఎదురింట్లో ఉండే ఓ వ్యక్తి బాలికపై అత్యాచారం చేసి అనంతరం చిన్నారిని డ్రమ్ములో ముంచి హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మదనపల్లెలో ఓ బాలిక(7) రెండో తరగతి చదువుతోంది. సోమవారం స్కూల్‌కు సెలవు కావడంతో ఇంటి దగ్గర ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చి కూతురు కోసం తండ్రికి తల్లి పోన్ చేసి కూతురుని అడిగింది. స్నేహితుల వద్ద ఆడుకుంటుందో ఏమో అని తల్లిదండ్రులు భావించారు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఎదురింటి డోర్‌ను పలుమార్లు కొట్టిన కూడా అతడు తెరవకపోవడంతో వెనుదిరిగారు. బాలిక కనిపించడం లేదని స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. రాత్రి 1.30 పోలీసులు ఎదురింటి యువకుడి కులవర్ధన్ (30) కిటికీలో నుంచి చూడగా కులవర్ధన్(30) నిద్రపోయి కనిపించాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు మళ్లీ అతడి ఇంటికి తలుపులు బద్దలు కొట్టారు. బాలిక కోసం వెతికగా డ్రమ్ములో చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికకు శవ పరీక్షలు నిర్వహించగా అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా తేలింది. పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని స్థానికులు, వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కులవర్ధన్ నేర చరిత్ర ఉందని స్థానిక పోలీసుల వెల్లడించారు. గతంలో ఒకరిపై కొడవలి దాడి చేయడంతో అతడిపై కేసు నమోదైంది. ఇద్దరు, ముగ్గురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై వారు ఫిర్యాదు చేశారు. కానీ అతడి వారిని బెదిరించడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారని తెలిపాడు.







