Sirimalli

My WordPress Blog

టీ20 వరల్డ్ కప్.. నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ..

అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. హ్యాట్రిక్ విజయాలతో టీమిండియా ఇప్పటికే సూపర్8 బెర్త్‌ను సొంతం చేసుకుంది. నెదర్లాండ్స్ కూడా రేసులో ఉన్నా ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న టీమిండియాను ఓడించడం నెదర్లాండ్స్‌కు కష్టంతో కూడుకున్న అంశమే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి ప్లేఆఫ్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే పట్టుదలతో ఉంది.

అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టును కలవరానికి గురి చేస్తోంది. కిందటి మ్యాచ్‌లో అభిషేక్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, దూబె తదితరులు ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా మారింది. పాక్‌పై ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. బౌలింగ్‌లోనూ భారత్ బలంగా ఉంది. వరుణ్ చక్రవర్తి, బుమ్రా, కుల్దీప్, అక్షర్ తదితరులు జోరుమీదున్నారు. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.