Sirimalli

My WordPress Blog

Pooja Hegde : ప్రభాస్ సోషల్ మీడియాను వదిలేయాలనుకుంటున్నాడు

Pooja Hegde Reveals Prabhas Wants To Quit Social Media

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే అందరూ చెప్పే పేరు ప్రభాస్. వెండితెరపై తన నటనతో, కటౌట్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ‘డార్లింగ్’, నిజ జీవితంలో మాత్రం చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను పెంచుకుంటుంటే, ప్రభాస్ మాత్రం దానికి భిన్నంగా నడుచుకుంటున్నారు.

అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం అందుకు పూర్తిగా బిన్నంగా ఉంటారు. అసలు ఆయన సోషల్ మీడియా వాడరని గతంలో ప్రభాస్‌తో కలిసి ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటించిన నటి పూజా హెగ్డే కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారని, ఆయనకు టెక్నాలజీ లేదా ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల గురించి అంతగా తెలియదు, ఆయన చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారని, సోషల్ మీడియా హడావుడి ఆయనకు నచ్చదు, ప్రభాస్ పేరుతో ఉన్న అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ప్రభాస్ నిర్వహించరు. ఆయన తరపున ఒక  డిజిటల్ టీమ్ వీటిని చూసుకుంటుంది. ఈ అకౌంట్స్‌ను కేవలం తన సినిమాల ప్రమోషన్లు, కొత్త చిత్రాల అప్‌డేట్స్ మరియు ఇతర వృత్తిపరమైన ప్రకటనల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు’ అని తెలిపింది. ప్రభాస్ అకౌంట్స్ నుండి ఎప్పుడూ పర్సనల్ ఫోటోలు లేదా వీడియోలు రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం లేదా నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండటం ఆయన స్వభావానికి విరుద్ధమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.