Sirimalli

My WordPress Blog

వారణాసిలో శివుడి భక్తుడిగా ప్రకాష్ రాజ్, మహేష్ బాబుతో కీలక పాత్ర

నవతెలంగాణ – హైదరాబాద్: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో నటుడు ప్రకాష్ రాజ్ శివుడి భక్తుడిగా నటిస్తున్నట్లు తెలిపారు. తనలోని నటుడి ఆకలిని ఈ చిత్రం తీర్చిందన్న ఆయన, హిందీ చిత్రం ‘దృశ్యం 3’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమా 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మహేష్ బాబు రుద్ర అనే అడ్వెంచరస్ పాత్రలో, రామాయణ నేపథ్యంలోని సీక్వెన్స్‌లో రాముడిగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ జార్జియాలో జరగనుంది.

The post వారణాసిలో శివుడి భక్తుడిగా ప్రకాష్ రాజ్, మహేష్ బాబుతో కీలక పాత్ర appeared first on Navatelangana.