Sirimalli

My WordPress Blog

Tvk Vijay : విజయ్ కు షాక్.. ఎన్నికల తర్వాతే విజయ్ ‘జననాయగన్’..

Jana Nayagan Postponed After 2026 Tamil Nadu Elections Confimed By York Cinemas Canada

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్  రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా ఈ సినిమా రిలిజ్ కు సంబంధించి ఫ్యాన్స్ కు షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. కెనడాలోని ప్రముఖ పంపిణీ సంస్థ యార్క్ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా జననాయగన్ విడుదల ఏకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు వాయిదా పడినట్లు వెల్లడించింది. సెన్సార్ బోర్డుతో కొనసాగుతున్న న్యాయపోరాటం కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం, ఫిబ్రవరిలో విడుదలవుతుందని అంతా భావించారు. అయితే, యార్క్ సినిమాస్ తన తాజా ప్రకటనలో, “ప్రియమైన ప్రేక్షకులారా, ‘జననాయగన్’ సినిమా ఏప్రిల్ 30వ తేదీ లోపు విడుదల కాదని గమనించగలరు. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తమ రిఫండ్  కోసం థియేటర్లను సంప్రదించవచ్చు” అని పేర్కొంది. దీనిని బట్టి ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ చివరలో లేదా మే నెలలో వచ్చే అవకాశం ఉంది.

 ఈ ప్రకటనతో ఒక విషయం స్పష్టమైంది. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు. విజయ్ తన సొంత పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) స్థాపించిన తర్వాత వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో, ఈ చిత్రం ఎన్నికల ప్రచారానికి ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ సెన్సార్ చిక్కులు, కోర్టు వివాదాల వల్ల ఈ సినిమా ఎన్నికల తర్వాతే విడుదల కానుంది. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమాను ఇప్పటికే రివైజింగ్ కమిటీకి పంపారు. అక్కడ క్లియరెన్స్ వస్తేనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కెనడా డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా విజయ్‌ని వెండితెరపై ఆఖరిసారిగా చూడాలనుకుంటున్న అభిమానులకు ఈ నిరీక్షణ మరికొంత కాలం తప్పేలా లేదు.