Sirimalli

My WordPress Blog

మన్యం జిల్లాలో బోల్తా పడిన ఆర్‌టిసి బస్సు: ఏడుగురికి గాయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం శివారులో ఆర్‌టిసి బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఒడిశాకు చెందిన 31 మంది కార్మికులు ఆర్‌టిసి బస్సులో నవరంగ్‌పూర్ నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భవన నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తాపడిన బస్సు క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.