స్టార్టప్ కంపెనీ‘సోహన్ సితార’ ఆవిష్కరణ
తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపకల్పన
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన స్టార్ట్ అప్ ‘సోహన్ సితార ప్రైవేట్ లిమిటెడ్‘ రూపొందించిన భారత దేశపు మొట్టమొదటి డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ఆస్ట్రో-టెక్ అనే కొత్త తరహా విభాగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది. రోజువారీ జీవితం లో పంచాంగ వివరాలు, శుభ సమయాలు తెలుసుకోవడానికి పంచాంగ పుస్తకాలు లేదా మొబైల్ యాప్స్‌ను తరచుగా చూడాల్సి వస్తుందనే ఒక సాధారణ పరిశీలన నుంచే ఈ ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ రూపంలో సాకారమైంది. ఇది కేవలం సమయం చూపిం చే గడియారం మాత్రమే కాదు, తిథి, నక్షత్రం, రాహుకాలం, యమగండం, సూర్యోదయం, -సూర్యాస్తమయం వంటి పంచాంగ వివరాలు రోజు వా రీ దేవత ఫోటోలను ప్రత్యక్షంగా చూపిస్తూ, మన రోజువారీ కార్యక్రమాలను సంప్రదాయం మరియు ఆధ్యాత్మికతకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది.
సోహన్ సితారా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ‘ఈక్షన్‘ బ్రాండ్‌గా రూపొందిన ఈ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్, ఆధునిక సాంకేతికతతో పాటు భారతీయ పంచాంగం జ్ఞానాన్ని కలిపిన ప్రత్యేక డిజిటల్ గడియారంగా ఎదుగుతోంది. పేటెంట్ కోసం దరఖాస్తు ఇప్పటికే దాఖలైంది. మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో పిజి పూర్తి చేసిన వ్యవస్థాపకుడు వి.శ్రవణ్ కుమార్, రోజువారీ జీవితంలో ఒక సాధారణ లోటును గమనించి ఈ ఆలోచనకు రూపం ఇచ్చారు. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ www.astrowallclocks. com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.






