ఢిల్లీ: టి20 వరల్డ్ కప్‌లో అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నమీబియాపై టీమిండియా 93 పరుగుల తేడాతో గెలుపొందింది. హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. హార్ధిక్ పాండ్యా 52 పరుగులు చేయడంతో రెండు వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో నే కాదు ఫీల్డింగ్‌లో అదరొగొట్టాడు. అక్షర్ పటేల్ వేసిన 12.3 ఓవర్లో నమీబియా బ్యాటర్ మలన్ క్రుగర్ బంతిని పైకి లేపాడు. బుమ్రా అతివేగంగా క్యాచ్ అందుకొని అశ్చర్య పరిచాడు. వాహ్ ఏం క్యాచ్ పట్టావు గురువా? అంటూ అశ్చర్యంగా అక్షర్ పటేల్ చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.





