Sirimalli

My WordPress Blog

Nithin : టైటిల్‌లోనే పండగ వైబ్.. అంజి దర్శకత్వంలో నితిన్ సాహసం !

Nithiin Sankranthi Subhakankshalu Movie Release Date 2027 Race

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే కేవలం పిండి వంటలు, కోడి పందాలే కాదు.. వెండితెరపై స్టార్ హీరోల మధ్య జరిగే అసలైన యుద్ధం. అయితే 2027 సంక్రాంతి మాత్రం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత రద్దీగా మారబోతోంది. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నలుగురు సీనియర్ స్టార్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా రేసులో ఉన్నారని టాక్. ఇంతటి భారీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ, యంగ్ హీరో నితిన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన కొత్త సినిమాతో ఈ పండగ బరిలో దూకాలని నిర్ణయించుకున్నారు.

Also Read : Chiranjeevi : 48 ఏళ్ల మెగా ప్రస్థానం.. ‘పునాదిరాళ్లు’ జ్ఞాపకాల్లో ఎమోషనల్ అయిన చిరంజీవి!

ఇటీవల ‘ఆయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో నితిన్ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశారు. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్‌లోనే పండుగ శోభ ఉండటంతో, ఈ సినిమాను కచ్చితంగా 2027 సంక్రాంతికే విడుదల చేయాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉంది. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, పండగ పూట ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. అయితే, థియేటర్ల సర్దుబాటు పెద్ద హీరోల హవా మధ్య నితిన్ ఎంతవరకు నిలదొక్కుకుంటారో అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.