Sirimalli

My WordPress Blog

Telangana Municipal Elections Live Updates: పుర పోరుకు వేళాయే..

Municipal Elections Live Updates Polling 116 Municipalities 7 Corporations

Telangana Municipal Elections Live Updates: తెలంగాణలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఈ పోలింగ్‌లో మొత్తం 52,17,413 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్లలో పురుషుల(25,49,750) కంటే మహిళలే(26,67,025) అధికంగా ఉన్నారు. ఇతరులు 638 మంది ఉన్నారు. అయితే.. ఇప్పటికే 116 మునిసిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డులకు గానూ ఇప్పటికే 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్టీవీ లైవ్ అప్డెట్స్ మీకోసం..

READ MORE: Telangana Municipal Elections: తెలంగాణలో ఎన్నికల పోరు షురూ..