Sirimalli

My WordPress Blog

జైలుల్లో పరిచయం.. క్రెడిట్ కార్డు పేరిట మోసాలు

పెట్రోలు బంకుల్లో క్రెడిట్ కార్డు పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్టషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు కథనం ప్రకారం.. రాపోలు శ్రీనివాస్ మహబూబాబాద్ పట్టణంలోని రెడ్డి కాలనీ లో నివస్తున్నాడు. అతని స్నేహితుడు చింతాడ సాయికుమార్ ఆంద్రఫ్రదేశ్ లోని కాకినాడ సమీపంలోని సర్పవరానికి చెందినవాడు. ఈ నెల 3న ఇద్దరు కలిసి వరంగల్ నుంచి హుజూరాబాద్ మీదుగా కమలాపూర్ లోని ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వద్దకు ఆటోలో వచ్చి అక్కడ పనిచేసే జక్కు రాజు అనే బంకు ఆపరేటర్ ను క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవాలని డబ్బులిస్తే చెల్లించాక మళ్లీ ఇస్తామని తెలిపారు. దీంతో రాజు రూ. 50 వేలకు రూ.2 వేలు కమిషన్ కావాలని కోరాడు.

దీంతో శ్రీనివాస్ రాజుకు క్రెడిట్ కార్డు బదులు డెబిట్ కార్డు ఇచ్చి ఆటోలో వెళ్లి పోయారు. ఆ తర్వాత సాయికుమార్ కు రాజు రూ. 49 వేలు పంపించాడు. చెల్లించిన డబ్బులు రాజుకు ఇవ్వకుండా సాయికుమార్, శ్రీనివాస్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన రాజు కమాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఇద్దరిని కమాలాపూర్ లో పట్టుకున్నారు. అంతకు ముందు ఇద్దరు వివధ నేరాల్లోకి జైలుకి వెళ్లి అక్కడ పరిచయమైన విడుదలయ్యాక మళ్లీ క్రెడిట్ కార్డు పేరిట ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఇద్దరి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.