కొందరు అధికారుల కుట్రపూరిత సహకారం కారణం కావొచ్చు
డిజిటల్ అరెస్ట్ ముసుగులో రూ.54వేల కోట్ల మేర దోపిడీ
ఆర్‌బిఐ, టెలీ కమ్యూనికేషన్స్ కలిసి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలో భారీ స్థాయి డిజిటల్ మోసాల తీవ్రత పట్ల సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఏ కంగా రూ.54,000 కోట్ల మేర సైబర్ నేరగాళ్లు పలువురి సొత్తు కాజేశారు. ఈ విధంగా పౌరుల సొమ్ము నయా చోరుల పాలు అయిందని, ఇది మోసం కాదు భారీ స్థాయి దోపిడీ అని వ్యాఖ్యానించారు. ఓ చిన్న రాష్ట్రం వార్షిక బడ్జెట్‌ను మించి దోపిడీ జరిగిందని ప్రధాన న్యాయమూ ర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మా ల్యా బాగ్చీ, ఎన్‌వి అంజారియాతో కూడిన ధ ర్మాసనం తెలిపింది. కేంద్రం వెంటనే స్పందించాల్సి ఉంది.
ఆర్థిక అక్రమ వ్యవహారం అయినందున వెంటనే దీని నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. సంబందిత భాగస్వామ్యపక్షా లు అయిన ఆర్‌బిఐ, పలు బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ విభాగంతో సంప్రదిపులకు దిగా లి. డిజిటల్ ఆన్‌లైన్ నేరాల ఆటకట్టుకు సరైన ప్రామాణిక మార్గదర్శకాలను(సాప్) రూపొందించాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ అరెస్టు మోసాలు జరుగుతున్నాయి. పలువురి బ్యాంకుల ఖాతాలు లూఠీకి గురవుతున్నాయి. ఈ దశలో బ్యాంకుల నుంచి నివారణ చర్యలు అత్యవసరమని బెంచ్ స్పష్టం చేసింది.





